కొండముచ్చులు బాబోయ్ కొండముచ్చు

Published: Monday December 13, 2021

మధిరలో కొండముచ్చులు ఉన్నాయి జాగ్రత్త

మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధిమధిర మున్సిపాలిటీ పరిధిలోరైల్వే స్టేషన్ మాత్రమే కాదు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఉన్నాయి ఆసుపత్రికి వచ్చే వారు తమతో పాటు రక్షణగా ఒక కర్రను తీసుకొని రండి. మదిరలో కొండముచ్చుల దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రైల్వేటేషన్ లో అనేక మంది కొండముచ్చు దాడితో గాయాలపాలయ్యారు. ఈ కొండముచ్చులు మధిర జనావాస ప్రాంతాల్లో సంచరించి ప్రజలను భయభ్రాంతులకు  గురిచేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా కొండముచ్చుల పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ఫారెస్ట్, సంబంధిత అధికారులు కొండముచ్చుల దాడుల నుండి ప్రజలను రక్షించాలని వాటిని నియంత్రించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.