దుడ్డు ప్రభాకర్, ఆర్కే భార్య శిరీష ఇళ్లపై ఎన్ ఐ ఏ దాడులు ఖండించండి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రస

Published: Wednesday July 20, 2022
బోనకల్, జులై 20 ప్రజా పాలన ప్రతినిధి:
మంగళవారం ఆంధ్రప్రదేశ్లోనే ప్రకాశం జిల్లాలో ఆలకూరపాడు , విజయవాడలోని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ మావోయిస్టు అగ్రనేత ఆర్కే జీవిత సహచరి శిరీష ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ దుర్మార్గంగా దాడులు చేయటాన్ని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండించింది. పేద ప్రజల తరఫున మాట్లాడుతున్న ప్రజా సంఘ నాయకులు లాయర్లు మేధావులు కవులు కళాకారులు రచయితలను పథకం ప్రకారమే కేంద్రంలో హిందూ మతోన్మాద ప్రభుత్వం దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే ప్రశ్నించే వాళ్లను వివిధ రకాల తప్పుడు ఆరోపణలతో తప్పుడు కేసులతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేయటం జైల్లో పెట్టడం నేడు దేశంలో సర్వసాధారణంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. యూఏపిఏ చట్టాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించి పబ్బం గడుపుతున్న బిజెపి ఇప్పటికైనా   ప్రజా వ్యతిరేక చర్యల మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క పక్కన దేశవ్యాప్తంగా వర్షాలు వచ్చి ప్రజల ఇబ్బందులు రైతులు అనేక రకాల పంటలు వేసి నష్టపోయి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే వారి సమస్యలను పరిష్కరించే బదులు సమస్యను పక్కదారి పట్టించడానికి ఇలాంటి దాడులకు పూనుకుంటున్నారని తెలుగు రాష్ట్రాలలో గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలలో ప్రజలు వరదలు వచ్చి బాధలో ఉంటే పట్టించుకునేవారు లేక అన్నమో రామచంద్ర అంటూ బాధపడుతున్నారని 18 తారీకు నుంచి అనేక నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుడిని బతికే పరిస్థితి లేని వ్యవస్థలు సృష్టిస్తున్న పాలకవర్గాలు కావాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. బహిరంగంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని చట్టబద్దంగా పనిచేస్తున్న సంఘాలపై నాయకులపై ఇకనైనా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణ మానుకోవాలని సాక్షాత్తు సుప్రీంకోర్టే ప్రశ్నించే వాళ్లు ఉండాలని కోరుకుంటుందని  ఆయన గుర్తు చేశారు.