నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న మహిళలు

Published: Thursday March 10, 2022
సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ సబితా
వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన : నేటి సమాజంలో మహిళలు నమ్మకానికి మారుపేరు గా నిలుస్తారు అని సబితా ఆనంద్ పౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఆనంద్ కొనియాడారు. మంగళవారం మర్పల్లి మండల పరిధిలో గల కోటమర్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాజయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా డాక్టర్ సబితా ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సబితా ఆనంద్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో చాకచక్యంగా నైపుణ్యంతో పనులను చక్కబెడుతున్నారని గుర్తు చేశారు. నేటి మహిళలు అబల కాదు సబల అని నిరూపించిన సందర్భాలు కోకొల్లలని స్పష్టం చేశారు. మహిళలు వంటింటినే కాకుండా సమాజాన్ని కూడా చక్కదిద్దే సామర్థ్యం గలవారని వివరించారు. మహిళలు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బట్టు లలిత, మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బి రాచయ్య, పిఎసిఎస్ మాజీ చైర్మన్ రఘుపతి రెడ్డి, ఎంపీటీసీ సుజాత వెంకట్ రెడ్డి, కార్యదర్శి స్వప్న, ఏఈఓ నీరజ, ఉపాధ్యాయులు నాగమణి, వీణ, రాధ, సంధ్య, ప్రధానోపాధ్యాయుడు అశోక్, హన్మంతరావు, వెంకట్ రెడ్డి, తహసీన్ పార్టీ అధ్యక్షుడు, శ్రీశైలం రైతు బంధు అధ్యక్షుడు, జైహింద్ రెడ్డి, రాహుల్, నర్సమ్మ, వార్డ్ మెంబర్లు, జుట్టు కృష్ణయ్య, నర్సింహా, విష్ణు వర్ధనరెడ్డి, రమేష్ గౌడ్, యువజన నాయకులు లావణ్య, కిష్టమ్మ, వినోద, పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం చేసి మహిళలకు ఆటల పోటీలు నిర్వహిచడం జరిగింది. గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.