ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న దళితబందు మంచిదే కానీ సబ్సిడీ రుణాల మాటేమిటి - ప్రజాసంఘాల

Published: Wednesday June 29, 2022

కోరుట్ల, జూన్ 28 (ప్రజాపాలన ప్రతినిధి):
రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ రంగాల్లో అర్హులైన దళితులకు  ప్రతిఎటా ఇచ్చే స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలను ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న అందించకపోవడం చోచనీయమని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్  ఆరోపించారు.మంగళవారం కోరుట్ల లోని తన కార్యాలయంలో పేట భాస్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుండి దళితబందు పెరిట రాష్ట్ర ప్రభుత్వం కొంత మంది దళితులకు అందిస్తున్న సదుపాయాలను స్వాగతిస్తున్నమని అదే సందర్భంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సబ్సిడీ రుణాల మాటేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని దళిత యువత గ్రహిస్తున్నారని ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదన్నారు.ఎస్సీ కార్పొరేషన్ అధికారులు జరిపిన ఇంటర్వ్యూలో అర్హత పొందిన దళిత యువకులకు బ్యాంకుల నుండి ఇచ్చే రుణాలకు డిపాజిట్ చేస్తేనే పైల్ పైనల్ అవుతుందని బ్యాంకు అధికారులు తిరకాసు పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసిమరి డిపాజిట్లు చేశారని, సంవత్సరం గడుస్తున్న సబ్సిడీ రుణాలు అందకపోవడంతో తెచ్చిన అప్పులకు  వడ్డీలు పెరుగుతున్నయని వాటిని కట్టలేని స్థితిలో వున్న దళిత యువత కు ఇకనైనా రుణాలు మంజూరు చేసి వారిని అదుకోవాలని పేట భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.