యువత సన్మార్గంలో పయనించాలి- రసమయి శంకరపట్నం నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి:

Published: Monday November 14, 2022

తొలిపొద్దు పర్యటనలో భాగంగా మానకొండూర్ మండలం లో ఎమ్మెల్యే రసమయి విస్తృతంగా పర్యాటించార
తొలిపొద్దు పర్యటనలో భాగంగా ఆదివారము  వేకువ జామునుండి మానకొండూర్ మండలంలోని అన్నారం, రాఘవాపూర్, మానకొండూర్ గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో అన్నారం గ్రామానికి చెందిన 40 మంది యువకులు ఉతీర్ణులయ్యారు
వారికి దేహ దారుడ్య పరీక్షల కోసం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో శిక్షణ నిమిత్తం వ్యాయామ వసతుల ఏర్పాట్ల కోసం ఆయన పరిశీలించారు
ఈ సంధర్బంగా రసమయి గారు మాట్లాడుతూ అన్నారం గ్రామం పోలీస్ ఉద్యోగులకు నిలయంగా మారిందని, ఇదే గ్రామానికి చెందిన 60 మంది యువకులు ప్రస్తుతం కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని, మళ్ళీ మరో 40 మంది రాత పరీక్షల్లో ఎంపిక కావడం అభినందనీయం అన్నారు
గ్రౌండ్లో రన్నింగ్ ట్రాక్, షాట్ ఫుట్, లాంగ్ జంప్ వసతులతో పాటు విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందులో భాగంగా యువతకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు
అన్నారం గ్రామంతో పాటు రాఘవాపూర్ గ్రామాలలోని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కళ్యాణాలక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు
అనంతరం మానకొండూర్ గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను రసమయి గారు పరామర్శించి, తమ సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమంలో కరీంనగర్ సుడా చైర్మెన్ మరియు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ.జీవి.రామకృష్ణారావు, జడ్పిటీసీ సభ్యుడు శ్రీ.తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు