తాసిల్దార్ కు వినతి పత్రం

Published: Saturday December 11, 2021

ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 10 ప్రజాపాలన : ఇబ్రహీంపట్నం మండలం తహసీల్దార్ ఇబ్రహీంపట్నం నమస్కరించి తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక క్రిస్మస్ విందు, దుస్తుల పంపిణీ పథకం అమలు నియోజకవర్గంలోని పేద క్రైస్తవులు, పాస్టర్లందరికి సమానంగా అందజేసిన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు రాజ్యాంగ ప్రకారం ప్రజలందరికీ సమానత్వాన్ని చాటమని కోరుట గురించి, అయ్యా, మేము అనగా క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కమిటీ (రిజిస్టర్ నంబర్.558 of 2021) వారము, సుమారు ఇబ్రహీంపట్నం మండలం 23 చర్చిల పాస్టర్లు, క్రైస్తవ విశ్వాస కుటుంబాలకు చెందిన వారము, తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మంత్రులు, ప్రభుత్వ ఉన్నత అధికారులు  రాజ్యాంగ మత స్వేచ్చ, సమానత్వాన్ని పాటిస్తూ ఇతర మతస్తుల పండుగల మాదిరిగా క్రైస్తవ, దళిత క్రైస్తవుల మనోభావాలను, మత విశ్వాసాలను గౌరవించి క్రిస్మస్ పండుగను తెలంగాణ రాష్ట్ర అధికార పండుగగా గుర్తించి, అట్టి పండుగను అధికారికంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు విశ్వాసులు, భక్తులతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా,  క్రిస్టియన్  సమాజం ఆత్మ  గౌరవం కోసం గౌరవించి క్రిస్మస్ కానుక బట్టలు 2 లక్షల రూపాయలు 1000 జతల బట్టలు ఇస్తుంది. అయితే అనుకోని విధంగా మన ఇబ్రహీంపట్నం మండలం లో ఈ పథకం కేవలం కొద్ది మంది పాస్టర్లు మాత్రమే వారి అనుకూలంగా స్వార్థంగా తమవారికే కేటాయించుకొని నిజమైన పేద దళిత క్రైస్తవులకు, మా అసోసియేషన్ వారికి అందకుండా ప్రభుత్వ మంచి ఉద్దేశ్యాన్ని తప్పుద్రోవ పట్టిస్తూ అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కావున తమరు దయచేసి ఇట్టి విషయంలో వెంటనే స్పందించి  ప్రభుత్వ సదుద్దేశంతో ఇచ్చే సంక్షేమ పథకాలు, క్రిస్మస్ డిన్నర్, గిఫ్ట్ లను ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పాస్టర్లు, క్రైస్తవులకు, పాస్టర్ ఫెలోషిప్ లకు సమానంగా పంపిణీ చేసి రాజ్యాంగ సమానత్వాన్ని గౌరవ ఎమ్మార్వో గారు పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కృతజ్ఞతతో మనవి చేస్తున్నాము. ఈ విషయంలో మా పాస్టర్ ఫెలోషిప్ క్రిస్టియన్ అసోసియేషన్ నుండి ఒక చర్చి పాస్టర్ అకౌంట్ నెంబర్ కూడా తీసుకోవాలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అప్పటి వరకు క్రిస్మస్ సెలెబ్రేషన్ కమిటీ పంపిణీ నిలిపివేయాలని కొరుచున్నాము.