ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలి

Published: Monday September 19, 2022
మధిర  సెప్టెంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి ఆర్య వైశ్య సంఘాలకు నాయకత్వం వహిస్తున్న ఆర్య వైశ్య నాయకులు ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం పాటుపడాలని రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి శ్రీకాంత్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహారావు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దాచేపల్లి ముత్యాలు రిటైర్డ్ ఎంపీడీవో మాధవరపు నాగేశ్వరరావు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ రావు కపిలవాయి జగన్ మోహన్ రావు రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కన్వీనర్ పల్లపోతు ప్రసాదరావు కోరారు. ఆదివారం ఖమ్మంజిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆవరణ నందు ఆర్యవైశ్య సంక్షేమ సంఘం మధిర నియోజకవర్గ మండలం పట్టణ అధ్యక్షులు ఎంపిక మరియు ప్రమాణస్వీకారం మహోత్సవం నిర్వహించినారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి శ్రీకాంత్ మరియు ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంఘ మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ల లక్ష్మీ నరసింహారావు, మండల ఆర్యవైశ్య అధ్యక్షులు దాచేపల్లి ముత్యాలు, పూర్వ విద్యార్థి సంఘ సేవకులు మాధవరపు నాగేశ్వరరావు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ జగన్ మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యల సంక్షేమ కొరకు నిరంతరం సేవా కార్యక్రమాలు చేయబడుతూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని వారు సూసించారు. అనంతరం ఆర్యవైశ్య సంక్షేమ సంఘం మధిర నియోజకవర్గ అధ్యక్షులుగా చలువాది కృష్ణమూర్తి  మండల ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులుగా
పబ్బతి రమేష్
మధిర పట్టణ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు వెచ్చా వీరభద్రరావుని చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నూతన కమిటీల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు సిద్దంశెట్టి శ్రీకాంత్ కి కన్వీనర్ పల్లపోతు ప్రసాదరావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కన్వీనర్ పల్లపోతు ప్రసాదరావు, జనరల్ సెక్రెటరీ మిరియాల కాశీ విశ్వేశ్వరరావు గౌరవ సలహాదారు యర్రా లక్ష్మణరావు, దొడ్డా శ్రీనివాసరావు, పరిశా శ్రీనివాసరావు, కొత్తమాసు రామారావు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area