నిరుపేదల పలువురికి సీఎం సహాయనిధి

Published: Tuesday September 07, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 6, ప్రజాపాలన ప్రతినిధి : ఆపదలో ఆదుకోన్న, అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వమని స్థానిక కార్పొరేటర్ చుక్క శివ కుమార్ అన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మామిడిపల్లి 11వ డివిజన్ కార్పొరేటర్ చుక్క శివ కుమార్ సహకారంతో ఆ డివిజన్ వారు నిరుపేద కుటుంబాలు ఆపదలో ఉన్నారని తెలుసుకొని, సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లికేషన్ చేశారు. మామిడిపల్లి గ్రామ నివాసులైలు అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆ నిరుపేద కుటుంబానికి చెందిన కోట్ల బాబు తండ్రి పెద్ద నరసింహ్మ కి (25,000) వేల రూపాయలు, ఈరంకి రాజ్ కుమార్ గౌడ్ తండ్రి నరసింహ గౌడ్ (30,000) వేల రూపాయలు, లిక్కి సీతా రామ్ రెడ్డి తండ్రి  లిక్కి బాల్ రెడ్డి (60,000) వేల రూపాయలు, సీఎం రిలీఫ్ ఫండ్ సహాయనిధి చెక్కులను మన రాష్ట్ర తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా బాధితులకు అందజేశారు. బాధితులు మాట్లాడుతూ.... సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఆదుకున్న స్థానిక కార్పొరేటర్, టీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా మంత్రి కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక కార్పొరేటర్ నిరుపేదలకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సెల్ ప్రెసిడెంట్ నిమ్మల నరేందర్ గౌడ్, 12వ డివిజన్ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.