మిలీనియం పాఠశాల లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మధిర సెప్టెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి ము

Published: Tuesday September 06, 2022

మిలీనియం హైస్కూల్ మరియు సుశీల జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీతేజ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ కరెస్పాండెంట్ శ్రీ కరివేద వెంకటేశ్వరరావు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీ గొట్టిపాటి రామ మోహనరావు చిత్రపటం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుశీల మరియు మిలీనియం విద్యా సంస్థ లలో పనిచేసే అధ్యాపక, ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సన్మానించారు. 2022-23 విద్యా సంవత్సరానికి ముగ్గురు సీనియర్ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఒక్కరికి 10,000 నగదు మరియు శాలువా తో ఘనంగా సత్కరించారు. హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి మహమ్మద్ నహర్ సుల్తానా,గణిత ఉపాధ్యాయురాలు . లక్ష్మి, . వెంకట కృష్ణ
ఈ అవార్డ్ కు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా కె వి  మాట్లాడుతూ అజ్ఞానమనే చీకటి ని తొలగించి విజ్ఞాన జ్యోతి ని వెలిగించే మార్గదర్శి గురువు అని పేర్కొన్నారు. విద్యార్థి భవిష్యత్తు తరగతి గది లో నిర్మితమౌతుందని,భావి భారత పౌరులను తయారుచేసే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికే ఉందని అన్నారు. ఈ సందర్భంగా గురువు యొక్క గొప్పతనాన్ని వివరించార స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమంలోకోటేశ్వరరావు శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ పాల్గొన్నారు