ఆర్యవైశ్యుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్లక్ష్య ధోరణి విడనాడాలి

Published: Monday July 05, 2021
మధిర, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘం నాయకులు కుంచం కృష్ణారావు గత ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2019లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ లో భాగంగా కమలాపూర్ వైశ్య సామాజికవర్గానికి కమ్యూనిటీ హాల్ స్థలంతో పాటు కోటి రూపాయలు ప్రకటన చేసినందుకుసంతోషపడాలా లేక షావుకారు గాడు అని ఈ మధ్య జరిగిన సభలో అవమానపరిచినందులకు బాధ పడాలా? ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచకుండా ఈతాకు ఇచ్చి తాటాకు దొబ్బినట్లు అనే సామెతను నిజం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద ఆర్యవైశ్య సోదరులు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికల లోపు వెయ్యి కోట్ల రూపాయల ఫండింగ్తో ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించాలని మరియు మంత్రివర్గంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రాష్ట్రంలో పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు కుంచం కృష్ణారావు డిమాండ్ చేశారు