ప్రచార ఫ్లెక్సీలకు పంచాయతీ ట్రాక్టర్

Published: Friday February 26, 2021

రాయికల్, ఫిబ్రవరి 25 (ప్రజాపాలన ప్రతినిధి) : మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కొత్తపేట గ్రామములోని నాగాలయానికి దర్శన నిమిత్తం రావడంతో ఆమెకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలకు రామాజిపేట గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను వాడుతూ ఫ్లెక్సీలు, కర్రలు రవాణా చేస్తున్నారు. ప్రజల పన్నులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ను ప్రైవేటు కార్యక్రమాలకు వినియోగించడం ప్రైవేట్ ఫ్లెక్సీ ప్రచారానికి వాడుకోవడం అధికార దుర్వినియోగం మరియు ప్రజాధనం దుర్వినియోగంగా భావిస్తున్నామని భాజపా నాయకులు అన్నారు. ఇట్టి విషయమై పంచాయతీ కార్యదర్శికి చరవాణి ద్వారా ఫిర్యాదు చేశారు.గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా తమ పనులకు ట్రాక్టర్ ను వాడుకోవడం జరిగిందని అన్నారు.