ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు

Published: Thursday March 03, 2022
వికారాబాద్ బ్యూరో 02 మార్చి ప్రజాపాలన : వికారాబాద్ టీఆరెస్ పార్టీ నాయకులు కొత్తగడి పిఏసీఎస్ వైస్ చైర్మన్ నర్సిములు, వికారాబాద్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మహిపాల్ జన్మదిన వేడుకలు బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నర్సిములు, మహిపాల్ లకు ఎమ్మెల్యే ఆనంద్ కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు గయాజ్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బిసి సెల్ అధ్యక్షులు చాకలి పాండు, నాయకులు అనంత్ రెడ్డి, సుభాన్ రెడ్డి, విజయ్ కుమార్, షఫి తదితర నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు.