టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి - మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

Published: Thursday November 24, 2022
శంకరపట్నం ప్రజాపాలన రిపోర్టర్ నవంబరు 23:


ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర ద్వితీయ మహా సభలను విజయవంతం చేయాలని జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపూరావు పిలుపునిచ్చారు. బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలో టిడబ్ల్యూజేఎఫ్ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,ఈనెల 27న హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయని, మహాసభల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, పలువురు ఎడిటర్లు పాల్గొంటారని తెలిపారు. మహాసభల్లో గత కార్యక్రమాలను సమీక్షించి, జర్నలిస్టుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. మహాసభలకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమైక్య నాయకుడు దేవునూరి  రవీందర్ మాట్లాడుతూ , జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, ఇండ్ల స్థలాలు , బస్సు పాసులు , రైల్వే పాసుల కోసం అనునిత్యం పోరాడుతున్నామన్నారు . కార్పొరేటర్ గుప్పిట్లో మీడియా చిక్కుకుందని దీంతో మీడియాపై దాడులు తీవ్రతరమవుతున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో ఈ మహాసభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పత్రికల సంపాదకులు ఎలక్ట్రానిక్ మీడియా సివోలు లను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో గొట్టే అర్జున్, సతీష్ , ఎలుకపల్లి సుధీర్ ,శ్రీనివాస్, దామెర సతీష్ , తదితరులు పాల్గొన్నారు.