సోషల్ మీడియా వేదికగా రేగా ని విమర్శిస్తే ఊరుకొనేది లేదు యూత్ అధ్యక్షులు గద్దల రామకృష్ణ బూర్

Published: Wednesday December 14, 2022
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు బిఆర్ఎస్   పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు & పినపాక శాసన సభ్యులు,, అభివృద్ధి ప్రదాత శ్రీ రేగా కాంతారావు ను నిన్న సోషల్ మీడియా వేదికగా పెట్టినటువంటి పోస్ట్ నకు.. ఎవరైనా స్థాయిని మించి,, స్థాయిని మరిచి  వ్యతిరేకముగా కామెంట్స్ పెట్టడం మీకు సరి అయిన పద్దతి కాదు..నిన్న ఒక వ్యక్తి  రేగా గారిని సోషల్ మీడియా వేదికగా విమర్శించడం జరిగినది..అసలు నువ్వు ఏ పార్టీకి చెందిన వ్యక్తివి.. ఒకవేళ నువ్వు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తివి ఐతే ఏరోజు కూడా నువ్వు పార్టీ కండువా కప్పుకొని ఏ ఒక్క కార్యక్రమానికి పాల్గొన్న దాకలాలు లేవు.. సోషల్ మీడియా వేదికగా నీకు ఇష్టం వచ్చినట్లు పెద్దవారిని నువ్వు విమర్శిస్తే నువ్వు ఏదో పెద్ద వాడివి అవుతానని భ్రమలో ఉండకు... అశ్వాపురం మండలాన్ని శ్రీ రేగా కాంతారావు  ఇంతగా అభివృద్ధి చేస్తుంటే నీకు కనిపించడం లేదా... అశ్వాపురం మెయిన్ రోడ్డు నందు సెంట్రల్ లైటింగ్, రోడ్డునకు ఇరువైపులా సైడ్ డ్రైన్స్... మండలంలోని రోడ్లు,బ్రిడ్జి లు,, కల్వట్లు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు పార్టీలో ఉంటూ కోవర్టుగా పని చేస్తున్నావా..మా ఓపికను పరీక్షించకు...ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతె ప్రజల చేతిలో నీకు గుణపాఠం తప్పదు.
ఈ కార్యక్రమంలో మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు కోలా భాస్కర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి జక్కుల సందీప్ యాదవ్, ప్రచార కార్యదర్శి జూపల్లి కిరణ్, సహాయ కార్యదర్శి కన్నెబోయినా వెంకటేశ్వర్లు నాయక్ పోడు,మడిపల్లి రమేష్, పార్టీ బట్టీల గుంపు యువజన విభాగం అధ్యక్షులు పొడుతూరి సందీప్, లింగమల్లు యాదవ్, నాగరాజు దొర, సురేష్ దొర,కాలవ విజయ రాజు, కరకపల్లి డేవిడ్, శ్యామ్,దామెర్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.