ప్రజాక్షేత్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతాం : బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుగుల

Published: Saturday September 24, 2022
బోనకల్ ,సెప్టెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ , జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పిలుపుమేరకు బోనకల్ మండలం లో అన్ని గ్రామాలలో 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త మండల కేంద్రం ఏర్పాటు నుంచి జూన్ 30 2022 వరకు మండలంలోని గ్రామపంచాయతీలలో గ్రామాల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సంవత్సరాలు వారీగా ఆర్టిఐ ద్వారా తెలుసుకునుటకు దరఖాస్తులు గ్రామపంచాయతీ కార్యదర్శులకు అందజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కోట్లాది రూపాయలు అభివృద్ధికి కేటాయిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిమండలిలో చేస్తున్న అసత్యపు అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టడం కోసమే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఐ దరఖాస్తులు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో అన్ని గ్రామపంచాయతీలో దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి తెలంగాణకు కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు పేర్లు మార్చి ఆ పథకాలను అన్ని తమవే అని గొప్పలు ప్రచారం చేస్తుందనీ, అబద్ధపు ప్రచారాన్ని నిగ్గు తేల్చడం కోసమే రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆర్టిఐ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని తెలియజేశారు. ఆర్టిఐ ద్వారా వచ్చిన సమాచారాన్ని రాబోయే రోజుల్లో పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందజేసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి అల్లిక కాశయ్య, గోపాలకృష్ణ, బాబు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.