నిబంధనకు విరుద్ధంగా నాగినేని ప్రోలు పాత గొమ్మూరు ఇసుక ర్యాంపు ఆందోళన చేపట్టిన గిరిజన సొసైట

Published: Friday December 02, 2022

మండల పరిధిలోని నాగినేని ప్రోలు పాత గొమ్మూరు ఇసుక ర్యాంపు నిబంధనలకు విరుద్ధంగా  టీఎస్ఎండిసి అధికారులు లేకుండా సీసీ కెమెరాలు లేకుండా, వే బ్రిడ్జి లేకుండా, స్థానిక గిరిజనులకు స్థానికంగా ఉన్న ట్రాక్టర్లకు  ఉపాధి కల్పించకుండా, తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తోలుకొని అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్న గిరిజనలు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తిరుగుతున్నాయని పాత సొసైటీ సభ్యులు సమాచారం తెలుసుకొని గిరిజనులు  పెద్ద ఎత్తున ర్యాంపు దగ్గరకు చేరుకొని ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లను ఆపి ఆందోళన నిర్వహిస్తున్నారు విషయాన్ని తెలుసుకున్న బూర్గంపాడు పోలీస్ అధికారులు గొమ్మూరు  రాంపు వద్దకు వెళ్లి ఇసుక ర్యాంపు వద్ద జరుగుతున్న ఆందోళన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు... నూతనంగా గిరిజనులచే   సొసైటీ ఏర్పడి జరుగుతున్న ర్యాంపుపై నూతన సొసైటీ గా ఏర్పడ్డ సభ్యులతో పాత సొసైటీ గిరిజన సభ్యులు కలవకపోవడంతో   పాత సొసైటీ సభ్యులకు తెలియజేయకుండా  నూతన సొసైటీ సభ్యులు ఇసుక ర్యాంపు కొనసాగించడం వల్ల  పాత సొసైటీ సభ్యులకు నూతన సొసైటీ సభ్యుల మధ్య చెలరేగిన విభేదాలు గొమ్మూరు ఇసుక ర్యాంపుకు ఎదురైన ఆటంకాలు... ఒకే గ్రామంలో ఉన్న గిరిజనులను ఒకే తాటిపై తీసుకువచ్చి  సొసైటీగా ఏర్పాటు చేసి నియమ నిబంధనలతో ఇసుక ర్యాంపు కొనసాగించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.