ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే వి ఎస్ డి డివైస్ క్లోజర్ విధానంతో హృద్రోగి ప్రాణాలు కాపా

Published: Wednesday February 22, 2023
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి):
 
 గుండె సంబంధిత వ్యాధితో (గుండె రంద్రం మరియు హార్ట్ ఎటాక్) బాధపడుతున్న 60 సంత్సరాల వ్యక్తికి ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ నిర్వహించాల్సిన అవసరం,కోత కుట్లు లేకుండా కేవలం గుండె ప్రొసీజర్ నిర్వహించి ప్రాణాలను కాపాడారు బేగంపేట్ లోని  మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు.ఈ సందర్బంగా  మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ 60 సంత్సరాల వయసున్న మహమ్మద్ మొయిజుద్దీన్ గుండెపోటుతో బేగంపేట్ లోని మెడికవర్ హాస్పిటల్స్ కు తీసుకోని రాగా,అతన్ని పరీక్షించిన డాక్టర్లు అతని గుండెలో రంద్రం (వి ఎస్ డి ), హార్ట్ ఫెయిల్యూర్ గుర్తించారు. చాలా మంది ఇటువంటి సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి రంద్రం పూడ్చడం జరుగుతుందని,కానీ ఈ పేషెంట్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ హై  రిస్క్ తో కూడుకున్నదని, వయసురీత్యా వి ఎస్ డి డివైస్ క్లోజర్ విధానం కూడా చాలా కష్టతరం కాని కార్డియాలజీ వైద్యులు డాక్టర్ దీపక్ సహా , డాక్టర్ సాకేత్, డాక్టర్ అవినాష్ దళ్  వి ఎస్ డి డివైస్ క్లోజర్ విధానం గుండె కోత లేకుండా ఈ  గుండె ప్రొసీజర్ నిర్వహించి రంద్రాన్ని పూడ్చడం జరిగిందని తెలిపారు.
అనంతరం డాక్టర్ సాకేత్   మాట్లాడుతూ ఇటువంటి గుండెపోటు వల్ల వచ్చే రంద్రంతో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి  80 శాతం మంది చనిపోతారన్నారు. ఇటువంటి సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా రిస్క్ తో కూడుకున్నదని, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా 
తొడ భాగం నుండి వి ఎస్ డి డివైస్ ని గుండెలోకిని పంపించి గుండె రంద్రాన్ని మూసివేయడం జరిగింది. వి ఎస్ డి డివైస్ క్లోజర్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
అనంతరం సెంటర్ హెడ్ హృషీకేశ్ మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలు , అధునాతన పరికరాలు మరియు అనుభవజ్ఞులైన డాక్టర్స్ వల్లనే ఇటువంటివి సాధ్యం అవుతాయి అని అన్నారు. రోగి కుటంబ సభ్యులు మాట్లాడుతూ వారి తండ్రికి  కొత్త జీవితాన్ని అందించినందుకు వైద్యులకు మరియు ఆసుపత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ  కార్యక్రమం లో కార్డియాలజీ విభాగం డాక్టర్లు దీపక్,డాక్టర్ సాకేత్, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ అవినాష్ దళ్ , అనస్తీషియా స్పెషలిస్ట్ డాక్టర్ అంగనా తదితరులు పాల్గొన్నారు.