ఘనంగా జాతీయ పక్షుల దినోత్సవం

Published: Friday January 06, 2023

జన్నారం, జనవరి 05, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్ పల్లి రేంజ్ లో గల మైసమ్మ కుంట వద్ద జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గురువారం అటవీ అధికారి మాధవరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ కు సంబంధించిన అటవీ సిబ్బంది పాల్గొని పక్షుల లెక్కింపు కార్యక్రమం చేపట్టినారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బందికి పక్షుల గుర్తింపు పోటీ ప్రవర్తన మరియు ఆవాస ఉండే పరిస్థితుల గురించి అవగాహన కల్పించబడునున్నారు. అటవీ అధికారులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు పాల్గొని టైనా కూలర్ ల ద్వారా పక్షులను వీక్షిత్తు వాటి పేర్లను గుర్తించడం జరిగిందన్నారు డివిజన్లోని అటవీ అధికారులు దాదాపు 40 కి పైగా పక్షి జాతులను గుర్తించడం జరిగిందన్నారు. అటవీ అధికారులు వీటన్నిటిని రికార్డు చేయడం జరిగిందన్నారు. పక్షులు కూడా పర్యావరణం లో భాగం కనుక వాటిని కాపాడవలసిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. అడవిలో కొన్ని పక్షి జాతులు అంతరించిపోవడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతిందన్నారు. పక్షుల ఆవాసాల పెరుగుదలకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ నందు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ నందు కుంటలు ఏర్పాటు కుంటలలో చేప పిల్లలు విడుదల గుడ్ల అమెరికా ఎండు చెట్లు అమెరికా మొదలైనవి కాపాడాలనన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ డివిజన్లో కొన్ని పక్షి జాతులు, గ్రే ఎడేడ్ ఫిప్ ఈగల్, కింగ్ ఫిషర్, రామచిలుకలు, డార్తర్, కామస్ మైన, ఫైడ్ మైన, బార్న్ స్వాలో, పోండ్ హిరాస్, ఓపెస్ బిల్ స్టార్క్, తదితర పక్షులు పేర్లను నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, డివిజన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.