యువతకు అన్యాయం చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గోరి కడతాం ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రసి

Published: Monday June 20, 2022
బోనకల్, జూన్ 19 ప్రజా పాలన ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను రోడ్డు పాలు చేస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దోజు శ్రావణ్ కుమార్ అన్నారు . మండలంలోని రాయన్న పేట అమరజీవి తూముప్రకాష్ భవనంలో ఆదివారం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం చిల్లిముంత మధు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికిముఖ్య అతిధి గా ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ మద్దోజు శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను రోడ్డు పై నిలబెట్టారని, కేంద్రం అగ్నిపధ్ పేరుతో యువత ను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తులు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే లు ఆదాని, అంబానిలకు ధారాదత్తం చేసి యువతకు ఉపాధి లేకుండా చేసే ప్రయత్నం కేంద్రం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తొత్తు గా వ్యవరిస్తూ సింగరేణి, అర్టిసి వంటి సంస్థలను కూడా ప్రవైట్ పరం చెయ్యడానికి ప్రయత్నం జరుగుతుందన్నారు. యువతకు అన్యాయం చేస్తే ఏఐవైఎఫ్ సమరశీల పోరాటాలకు సిద్ధం అవుతుందని, గ్రామ గ్రామాన యువతను చైతన్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గోరి కడతాం అని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి ఆనందరావు, సిపిఐ సహాయ కార్యదర్శి ఆకెన పవన్, అమర్నాధ్, ఈశ్వర్, మహేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.