ఘనంగా కౌన్సిలర్ ఆకుల మమత ఆనంద్ కూతురు వివాహ వేడుకలు

Published: Monday November 22, 2021

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల మమత ఆనంద్ కుమార్తె వివాహం ఇబ్రహీంపట్నం వైష్ణవి గార్డెన్స్ లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి  జలమోని రవీందర్, కప్పరి అంజయ్య, ఆశోక్, సురమోని సత్యనారాయణ, బగ్గవరపు రమేష్, చెరుకూరి మల్లేష్, పసునూరు వెంకటేష్, సురమోని బాబు, చెరుకూరి రాజు, హనుమంతు సుదర్శన్, నరాల విద్యాసాగర్ కౌన్సిలర్లు జెర్కొని బాలరాజు, భర్తాకి జగన్ హాజరై నూతన వధూవరులు మానస-వినయ్ కుమార్ లను ఆశీర్వదించారు.