అంగన్వాడీ కేంద్రంలో అన్న ప్రసన్న , కృష్ణాష్టమి వేడుకలు

Published: Saturday August 20, 2022
బోనకల్, ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని శుక్రవారం గోవిందపురం ఎస్సీ కాలనీ 1 వ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ హెచ్ విజయ ఆధ్వర్యంలో చిన్నారులకు ఇరుగు గోపి, వాణిశ్రీ వారి కుమారుడు కి అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ విజయ మాట్లాడుతూ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పిండి ప్రతిరోజు చిన్నారులకు వండి తినిపించాలని, ఈ పిండిలో పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో చిన్నారులు మంచి ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. 75 వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా చిన్నారులకు జాతీయ జెండా గురించి తెలియజేశారు. అనంతరం ఆటల పోటీలు అనేక రకాల ఆటలు పిల్లల చేత ఆడించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా చిన్నారులకు కృష్ణుడు అవతారంతో మంద తేజ్ రిత్విక్ గాంధీజీ అవతారంలో వేషధారణలు, రాధిక అవతారంతో జట్టెం శ్రావణిని బ్యుల అక్షిత్ అక్యుర నందన్లను వేషాలు వేయించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, మంద కరుణ, మంద సుమంత, ఇరుగు ప్రభావతి, ఆదూరి దీప్తి ,కొత్తపల్లి యశోద, ఏసుపోగు ,విజయ చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area