కార్పొరేట్ సెలూన్ లు వెంటనే రద్దు చేయాలి

Published: Friday February 12, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రజాపాలన: జూలూరుపాడు  మండలంలోని అన్ని క్షఔర (మంగలి)షాప్ లను  జిల్లా నాయకులు కడియాల సత్యం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి అనంతరం  జూలూరుపాడు మండల కేంద్రం లో మెయిన్ సెంటర్ నందు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ లూథర్ విల్సన్ కి మెమోరాండం అంద జేసి నిరసన వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు  కడియాల సత్యం మాట్లాడు తూ రాష్ట్రం లో ని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్పొరేట్ సెలూన్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని. రాష్ట్రం క్షఔర వృత్తిని నమ్ముకొని ఏళ్ళ తరబడి  జీవిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన నిరుపేద కుటుంబాలు రోడ్డున పడతాయని. క్షఔర వృత్తిని (మంగలి) సమాజ సేవ గానే బావిస్తామని. అలాంటి మా వృత్తికి ఇబ్బంది కలిగే కార్పొరేట్ సెలూన్ లు వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో. మండల అధ్యక్షులు. మాడుగుల నాగరాజు.కార్యదర్శి కె. మాణికుమార్.బుచ్చిబాబు. కె పుల్లయ్య. కె ఆనందరావు. కె రాజేశ్వరరావు. కె నాగేశ్వరావు. కె సతీష్. ప్రేమ్. అర్జున్. హరికృష్ణ. యం నరేష్.నరేష్. రాంబాబు. వి నాగరాజు. ఎస్ కళ్యాణ్. దయాకర్. కేవి. మధు. రాగవులు. తదితరులు పాల్గొన్నారు.