అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Thursday March 31, 2022

సారంగాపూర్, మార్చి 30 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ నాగునూర్ గ్రామంలో నాబార్డ్ నిధులు మరియు 20 శాతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిధులతో మొత్తం 24 లక్షలతో 300 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన ప్యాక్స్ గోదాం నిర్మాణానికి ఎమ్మేల్యే డా:సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి పాక్స్ ఛైర్మెన్ ఏలేటి నరసింహరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ సర్పంచులు దమ్మ గంగు రమణ రావు జయలక్ష్మారెడ్డి బెక్కం జమునశ్రీనివాస్ కొండ శ్రీలతప్రభాకర్ వివిధ గ్రామల సర్పంచులు ఎంపీటీసీలు ప్యాక్స్  డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.