మెరుగైన వైద్య‌సేవ‌లందించ‌డంలో‌ "ఆద్య స్కంద డయాగ్నోస్టిక్ సెంట‌ర్" ముందుండాలి

Published: Friday April 16, 2021
శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ 
 
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15, ప్రజాపాలన ప్రతినిధి : అధునాత‌న వైద్య‌స‌దుపాయాల‌తో, మెరుగైన వైద్య‌సేవ‌లందిస్తూ "ఆద్య స్కంద డయాగ్నోస్టిక్ సెంట‌ర్" న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు చేరువ‌వ్వాల‌ని శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ ఆకాంక్షించారు. కూక‌ట్‌ప‌ల్లిలోని నిజాంపేట్ రోడ్డులోని క‌మ్మ‌సంఘం భ‌వ‌న్ ప‌క్క‌న‌ గల కేఎన్ఆర్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన "ఆద్య స్కంద డయాగ్నోస్టిక్ సెంట‌ర్ ‌ను నిజాంపేట్‌ మేయ‌ర్ నీలా గోపాల్‌రెడ్డి, స‌న్‌షైన్ ఆస్ప‌త్రుల చైర్మ‌న్ డాక్ట‌ర్ గురువారెడ్డి, ప్ర‌ముఖ సినీ డైరెక్ట‌ర్ మారుతి, నిర్వాహ‌కులు వెంక‌ట సుధాక‌ర్‌రెడ్డితో క‌లిసి ఎమ్మెల్యే గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ న‌గ‌రంలో ముఖ్యంగా కూక‌ట్‌ప‌ల్లి, కుత్భుల్లాపూర్, నిజాంపేట్‌, శేరిలింగంప‌ల్లి ప్రాంతాల‌ ప్ర‌జ‌ల‌కు ఆధునాతన సౌకర్యాలతో కూడిన డయాగ్నోస్టిక్ సెంటర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ఈ క‌రోనా సంక్షోభంలో క‌రోనా తో పాటు ఏవైనా వ్యాధినిర్ధార‌ణ ప‌రీక్ష‌లు వేగంగా పూర్తి చేసేందుకు స్కంద డయాగ్నోస్టిక్ సెంట‌ర్ ముందుండాల‌ని పేర్కొన్నారు. అదే విధంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో సేవ చేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాల‌ని కోరారు. ఇలా ప్ర‌జా సేవ‌లో దిన‌దినాభివృద్ధి చెందుతూ హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా మ‌రిన్ని సెంట‌ర్లు ఓపెన్ చేయాల‌ని కోరారు. కొన్నేళ్లుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో డాక్టర్ వెంక‌ట‌ సుధాక‌ర్‌రెడ్డి, డాక్ట‌ర్ రూపారెడ్డి లు ఎంతో గొప్ప డాక్ట‌ర్లుగా  గుర్తింపు పొంది, రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవలు అందించి సుపరిచితులుగా ఉన్నారని తెలిపారు. వారు ప్ర‌జ‌ల‌కు మంచి వైద్య సేవ‌లందించాల‌నే ల‌క్ష్యంతో కొత్త‌గా "ఆద్య స్కంద డయాగ్నోస్టిక్ సెంట‌ర్" సేవలు ప్రారంభించడం శుభపరిణామమన్నారు. రాబోయే రోజుల్లో కూక‌ట్‌ ప‌ల్లి, కుత్భుల్లాపూర్, శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌  ప్ర‌జ‌ల‌కు వేగంగా వైద్య‌సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంత‌రం డాక్ట‌ర్ గురువారెడ్డి, డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ స్కంద డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతూ న‌గ‌ర‌వ్యాప్తంగా విస్త‌రించాల‌ని ఆకాంక్షించారు. అనంత‌రం డాక్ట‌ర్ వెంక‌ట‌‌ సుధాక‌ర్‌ రెడ్డి మాట్లాడుతూ "కూక‌ట్‌ప‌ల్లి, కుత్భుల్లాపూర్, నిజాంపేట్, శేరిలింగంప‌ల్లి‌‌ స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు అధునాత‌న‌మైన వైద్య‌సేవ‌లు అందుబాటులోకి తీసుకురావాల‌నే ఉద్ధేశంతోనే ఈ డయాగ్నోస్టిక్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశాం. ఈ క‌రోనా సంక్షోభంలో ప్ర‌తి ఒక్క పేషెంట్ వేగంగా క్ష‌ణాల్లో టెస్టులు పూర్తి చేసేలా ల్యాబ్‌లో అన్ని ఆటోమేటెడ్ మెషన్స్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మ‌‌‌ల్టీ స్లైస్‌ సీటీ స్కాన్‌, ఎక్స్‌రే ఇన్ 3 సెక‌న్స్- డిజిట‌ల్ రేడి యోగ్ర‌పీ, 4 డీ -అల్ట్రాసౌండ్‌, క‌ల‌ర్ డాప్ల‌ర్, పాలీ క్లినిక్‌ ఇత‌ర అన్నిఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీతో కూడిన మెష‌న్స్ ఏర్పాటు చేశాం. ల్యాబ్‌ల‌కు సంబందించిన ప‌రీక్ష‌లు, అన్ని కూడా పెద్ద‌లు, పిల్ల‌ల‌కు తేడా లేకుండా అత్యాధునిక వైద్య‌స‌దు పాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని, అన్ని వ‌ర్గాల‌కు అందుబాటులో ఉండేలా త‌క్కువ ప్యాకేజీలు రూపొందించి డిజైన్ చేశామన్నారు.
ఏడాది పాటు ప్ర‌తీ టెస్టుకు 20 శాతం రాయితీ..
హైద‌రాబాద్ న‌గ‌రంలోనే అత్యంత త‌క్కువ ఫీజుల‌తో సేవలందించేలా ఏర్పాటు చేసిన‌ట్లు వెంక‌టసుధాక‌ర్‌రెడ్డి తెలిపారు.‌ క‌రోనా సంక్షోభంతో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు భారం త‌గ్గించే విధంగా ఏడాది పాటు డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌లో ప్ర‌తి టెస్టు మీద 20 శాతం రాయితీ ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ అవ‌కాశంతో పాటు ముఖ్యంగా డయాగ్నోస్టిక్ సేవ‌లందించే స‌మ‌యాన్ని కూడా రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంచుతున్న‌ట్లు వివ‌రించారు.‌ పేషెంట్ల‌ను ప‌రీక్షించిన త‌ర్వాత వ‌చ్చిన ఫ‌లితాల‌ను కూడా చ‌క్క‌గా వివరించి ఎటువంటి ఫ‌లితాలు వ‌చ్చినా.. వారిని ఆందోళ‌న‌కు గురి చేయ‌కుండా ఎంతో  చ‌క్క‌ని సిబ్బందిని కూడా నియ మించాం. అందుకే చుట్టుప‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌లు ఈ సేవ‌లను ఉప‌యోగించుకోవాల‌ని కోరుతున్నామని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపాలిటీ కార్పొరేట‌ర్లు, స్థానిక నాయ‌కులు, డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ డాక్ట‌ర్లు, వైద్య‌స‌హాయ‌క సిబ్బంది, త‌దిత‌రులు పాల్గొన్నారు.