పశువులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాలు తప్పని సరి

Published: Tuesday January 31, 2023
* జిల్లా పశువైద్య,పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజా పాలన : పశువులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాలు తప్పని సరిగ్గా వేయించాలని జిల్లా పశువైద్య,పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్ అన్నారు.జాతీయ బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి,మద్గుల్ చిట్టంపల్లి పశు వైద్యశాలలో మండల పశు వైద్యాధికారి టి.ఉష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ,బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకినట్లయితే ఆడ చుడీ పశువులు ఈడ్చుకు పోవడం జరుగుతుందని,ఈ వ్యాధి ముఖ్యంగా పశువుల నుంచి మనుషులకు సోకె అవకాశం ఉంటుందని అన్నారు.పశువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకితే వంద్యత్వం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యాధి వల్ల దేశ,రాష్ట్ర వ్యాప్తంగా పాడిపశువుల యజమానులకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని హెచ్చరించారు.వ్యాధి నివారణ టీకాలు ఆడ లేగ,గేదె దూడలకు 4-8 నెలల వయసు వాటికి ఇచినట్లు అయితే జీవిత కాలం ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటాయని అన్నారు.ఈ వ్యాధి సోకితే పశువులో పాల ఉత్పత్తి తగ్గుతుందని,మేత మేయవని అన్నారు.కిల్లవాతం, పశువులు కుంటుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు ప్రహ్లాద్ ఉన్నారు.