ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యం.. : కొడిమ్యాల ఎస్సై కె.వెంకట్ రావు

Published: Thursday March 03, 2022

కొడిమ్యాల, మార్చి 02 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో కొడిమ్యాల నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కె. వెంకట్ రావు ను బుధవారం రోజు కొందరు విలేఖరులు మర్యాద పూర్వకంగా కలిశారు.కొడిమ్యాల కు చెందిన సైకాలజిస్ట్ నాంపెల్లి మల్లేశం సైకాలజిస్ట్ ల 2022 డైరీ ని ఎస్సై వెంకట్ రావు కు అంద జేశారు. అనంతరం నిర్వహహించిన సమావేశంలో ఎస్సై వెంకట్ రావు మాట్లాడుతూ  కోవిడ్  నియంత్రణలో ఉన్నప్పటికీ  పోలీసులకు ప్రజలు సహకరించాలని ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించి, కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.. వ్యాపారస్తులు గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారవేత్తలకు సూచించారు. మోటార్ చట్టాన్ని అనుసరించి త్రిబుల్ డ్రైవింగ్ హెల్మెట్ లేని ప్రయాణం మద్యపానము సేవించి వాహనాన్ని నడపడం స్పీడ్ డ్రైవింగ్ మొదలగు వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు భూమి విషయంలో తగాదాలు ఉంటే పోలీస్ స్టేషన్ కు రాకూడదని కోర్టులో తేల్చుకోవాలని ప్రజలకు తెలిపారు సీసీ కెమెరాలు లేని మండలాల చివరి గ్రామాలలో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఒక్కొక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని సీసీ కెమెరాలు నేరాలు నియంత్రించడంలో చాలా ఉపయోగపడతాయని తెలిపారు మండలంలోని ప్రజలను ప్రశాంతంగా నుంచి శాంతిభద్రతల పరిరక్షణ కోసమే విధులు నిర్వహిస్తామని ఈ విషయాలను అర్థం చేసుకొని ప్రజలు మాకు సహకరించాల్సిందిగా కోరారు.త్వరలోనే పూర్తి స్థాయి లో ప్రెస్ మీటింగ్ నిర్వహిస్తామని ఎస్సై వెంకట్ రావు తెలిపారు.