రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు

Published: Friday March 25, 2022
నస్పూర్, మార్చి 24, ప్రజాపాలన ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నివారణకై శ్రీరాంపూర్ పోలీసులు జాతీయ రహదారిపై కోన్స్, రోప్స్ ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ వద్ద జాతీయ రహదారిపై తరుచు  ప్రమాదాలు జరిగే ప్రదేశాలను జైపూర్ ఏసీపీ నరేందర్ ఆదేశాల మేరకు శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్ ఐ మానస, ఏఆర్టీ టీమ్ సభ్యులు ఎంవీఐ, ఎన్ హెచ్ , ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్ ను సందర్శించారు.  రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలు తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్షించారు. ప్రమాదాల నివారణ కు బ్లాక్ స్పాట్ వద్ద ఆర్సీసీ రోడ్ సేఫ్టీ డివైడర్స్, ధర్మో ప్లాస్టిక్ పెయింట్స్, రేడియం స్టెడ్స్, కోన్స్, రోప్స్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ మానవ తప్పిదం, అతివేగం  అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం వల్ల తరచుగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. హెచ్ కె ఆర్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ అధికారుల సమన్వయంతో ప్రమాదం జరిగిన, బ్లాక్ స్పాట్స్ వద్ద ధర్మో ప్లాస్టిక్ పెయింట్స్, రేడియం స్టెడ్స్, బ్రింగ్ లెటర్స్, సైనింగ్ బోర్డ్స్, వేగ నియంత్రణ బోర్డు  ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలిపారు. మద్యం సేవించిన వారికి అతి వేగంగా వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపినారు.