మాంకాళి రామకృష్ణ తిలక్ సతీష్ ఆర్థిక సాయం

Published: Thursday December 02, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 01 డిసెంబర్ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన తిరుపతిరావు ఇంటి పునర్నిర్మాణంలో సహాయం అందజేసిన శ్రీ ధ్యాన చక్ర ఫీలింగ్ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మహంకాళి రామకృష్ణ తిలక్, సతీష్ సిమెంట్ పోల్స్ మరియు 5 సిమెంట్ రేకులు సుమారుగా 4 వేల రూపాయల విలువ చేసే సిమెంట్ రేకులు & పోల్స్ నిరుపేద కుటుంబానికి అందజేత నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని దాతలకు అధికారులకు విన్నపం శ్రీ ధ్యాన చక్ర ఫీలింగ్ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మహంకాళి రామకృష్ణ తిలక్ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు, యస్ సి కాలనీకి చెందిన నిరుపేద గద్దల తిరుపతిరావు ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు కూలినది ఆ ఇంటి పునర్నిర్మాణ సహాయంలో భాగంగా తమ వంతు సాయంగా సుమారు 4000 రూపాయలు విలువచేసే 5 సిమెంట్ రేకులు మరియు సిమెంటు గద్దలతిరపతిరావు కుమారుడు కు అందించారు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసిన తిరుపతిరావు కుటుంబసభ్యులు. శ్రీ ధ్యాన చక్ర ఫీలింగ్ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మహంకాళి రామకృష్ణ తిలక్ మధిర మరియు పరిసర ప్రాంత ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్నారు. ప్రతి నెల నందిగామ మండలం మాగల్లు గ్రామంలో ఉన్న ముస్లిం వృద్ధాశ్రమంనకు మరియు డాక్టర్ వసంతమ్మ మానసిక వికలాంగుల సేవాసదనంనకు ప్రతి నెల బియ్యం 25 కేజీల చొప్పున యాభై కిలోల బియ్యం అందజేస్తూ, పెద విద్యార్థులకు పేదవాళ్లకు, వృద్ధులకు పలు రూపేనా సహాయ సహకారాలు అందిస్తూ గొప్ప మానవతాది. ఈ నెలలో రాయపట్నం గ్రామంలో వృద్ధురాలికి 25 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. మధిర ఎస్సీ కాలనీకి చెందిన నవీన్ అకాల మరణం పాలు కాగా మట్టి ఖర్చులు నిమిత్తం వికాస తరంగిణి మధిర శాఖ అధ్యక్షులు కుంచుం కృష్ణారావు గారి సూచన మేరకు మట్టి ఖర్చులు నిమిత్తం 1500 రూపాయలు దానం చేశారు. ఇల్లు కూలిన నిరాశ్రయులైన తిరుపతిరావు కుటుంబమునకు ఈరోజు నాలుగు వేల రూపాయల విలువగల ఇంటి సామగ్రిని అందించి మరోకమారు దాతృత్వం చాట్టుకున్నారు. ఆయన చేసే పలు సేవా కార్యక్రమాలను గుర్తించి భారత సేవా పురస్కారం అందించనున్నారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీ ధ్యాన చక్ర హీలింగ్ పీఠం అధ్యక్షులు మహంకాళి రామకృష్ణ తిలక్ ని ప్రత్యేక ప్రజలు రాజకీయ నాయకులు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు