మహిళాభివృద్ధి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం

Published: Tuesday March 09, 2021
- బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : మహిళాభివృద్ధి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని, ముస్లిం మహిళలకు సైతం ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కలిగించిన ఘనత బిజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని పురుషుల తోడు లేకున్నా ముస్లిం మహిళలు హజ్ యాత్ర చేసే అవకాశం లాంటి ఎన్నెన్నో సదుపాయాలు, అవకాశాలు, కల్పించిందని, తగిన చట్టాలను ప్రవేశపెట్టిందని బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ తెలియజేశారు.  బీజేపీ శేరిలింగంపల్లి మహిళామోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం మియాపూర్‌లోని అతిథి బ్యాంక్వెట్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు సమాజంలో మహిళల ప్రాధాన్యతను తెలియజేసేలా వైభవంగా చోటు చేసుకున్నాయి. ముఖ్య అతిథిగా బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ప్రత్యేక అతిథులుగా సినీ నటి కుమారి సిమ్రన్ చౌదరి, సినీ నిర్మాత శ్రీమతి శిల్పా చౌదరి, గౌరవ అతిథులుగా తెలంగాణ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు వీణారెడ్డి, విద్యావేత్త - లయన్స్ క్లబ్ గవర్నర్ సురభి దుర్గావాణి, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ, అడ్వకేట్ వరలక్ష్మి, ఎస్ఆర్ ట్రస్ట్‌కు చెందిన గోదావరి అంజిరెడ్డి, విద్యావేత్త విజయశ్రీ, సామాజిక కార్యకర్త చందనా తేజ, మిస్ యూనివర్స్ హిమజా నాయుడు పాల్గొన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పలువురు మహిళా ప్రముఖులు తమ విజయాలు, అనుభవాలను తెలియజేసి సభలో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమానికి తోడ్పాటునందించిన బిజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్ మాట్లాడుతూ సమాజంలో మహిళల కీలక పాత్ర గురించి వివరించారు. ప్రత్యేకించి మహిళాభివృద్ధి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న “బేటీ బచావ్ - బేటీ పడావ్, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, సైనిక దళాల్లోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, స్టాండప్ స్కీం, ముద్ర లోన్, మహిళలకు 26 వారాల మెటర్నిటీ లీవ్, మహిళా రక్షణకు వన్ స్టాప్ సెంటర్స్, కమ్యూనిటీ టాయ్‌లెట్లు వంటి పలు పథకాలు ప్రవేశపెట్టి  సమాజంలో మహిళలకు ఉన్నత స్థానాన్ని బిజేపీ కల్పించిందన్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న మహిళా విజేతలను పురస్కారాలతో యోగానంద్ గౌరవించారు. బీజేపీ శేరిలింగంపల్లి మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ మహిళాదినోత్సవ వేడుకలలో మహిళా మోర్చా నాయకులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.