గ్రామాభివృద్ధి కొరకు లక్ష రూపాయల ఎల్ఐసి బీమా చెక్కు బహికరించిన కైపు కగేందర్ రెడ్డి.

Published: Thursday October 06, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.
2020-21 ఆర్థిక సంవత్సరం రానికి మొరంపల్లి బంజర్ లో 100  ఎల్ఐసి పాలసీలు  చేసినదుకు గాను భీమా గ్రామము ఆయనది. దినికి గాను గ్రామ అభివృద్ధి కి కైపు ఖగేంద్రరెడ్డి ద్వారా LIC వారు గ్రామ సర్పంచ్ గారికి 100000(లక్ష)రూపాయలు ఇవ్వడం జరిగినది . దీనికిగాను పాలకవర్గం మరియు lic వారు సన్మానించారు.ఈ కార్యక్రమంలో LIC సీనియర్ బ్రాంచిమేనేజర్ N గోపాలకృష్ణ, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ విశ్వేశ్వరుడు , సర్పంచ్ దివ్యశ్రీ గారు, వార్డ్ మెంబర్ కామీరెడ్డి పద్మ, రామలక్ష్మి  గ్రామ పెద్దలు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, కైపు సుబ్బరామిరెడ్డి ,  ఎల్ఐసి వ్యాపారానికి సహకరించేనటువంటి బంధుమిత్రులు స్నేహితులకు చిరు సన్మానించడం జరిగినది, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైపు కగేందర్ రెడ్డి మాట్లాడుతూ జీవిత బీమా అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని అది భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేయడం జరిగినది. కాబట్టి అలాంటి జీవిత బీమాను కాపాడు కావాలని నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాగేందర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి పేదవారికి అండగా ఉంటానని వారు తెలియజేయడం జరిగినది.