పేదలకు భరోసా గా సీఎం సహాయ నిధి

Published: Tuesday March 15, 2022
నియోజకవర్గ వ్యాప్తంగా కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి నుండి పేదలకు అందిస్తున్నాం జడ్పీ చైర్మన్ లింగాల మధిర మార్చి 14 ప్రజాపాలన మధిర మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు టిఆర్ఎస్ కార్యాలయంలోమండల టౌన్ లో 18 లబ్ధిదారులకు రూ.5,37,000/- రూపాయల విలువ గల చెక్కులు పంపిణీనిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసాగా మారిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు.. శుక్రవారం నాడు మధ్యాహ్నం మధిర పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మధిర టౌన్ & రూరల్ మండలం లో మొత్తం 18 మంది లబ్ధిదారులకు రూ.5,37000/- రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అసలు CMRF అనేది ఉందని దానికి దరఖాస్తు చేసుకుంటే ఆర్దిక సహాయం అందుతుందని కూడా తెలియకుండా ఉందని కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుపేద కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందిస్తున్నారని తెలిపారు అందులో భాగంగానే మధిర నియోజకవర్గంలో ఇప్పటి వరకు వందలాది మందికి కోట్ల రూపాయలను ఆర్దిక సహాయంగా అందించాం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు ఎంపీపీ లలిత వెంకన్న రావూరి శ్రీనివాస్ కనుమూరి వెంకటేశ్వరావుఓంకార్ వార్డ్ కౌన్సిలర్ వీరారెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు