రక్షిత కౌలుదారు లకు రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం గా వెంటనే పట్టాలివ్వాలి అఖిల భారత వ్యవసాయ

Published: Tuesday September 13, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధినంది వనపర్తి సింగారం  తాటి పర్తి  కుర్మిద్ద  గ్రామాలల్లో రక్షిత  కౌలుదార్లు  1400 ఎకరాల  భూములు   తారతరాల నుండి సాగు చేస్తున్నా  భూములకు   పట్టాలు ఇయ్యాలని  ఈరోజు రిలే నిరాహార  దీక్ష యాచారం లో అఖిలభారత  వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి  బి వెంకట్   ప్రారంభించారు
ముందుగా ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు  పూల మాల  వేసి నాము  అనంతరం
బి వెంకట్  మాట్లాడుతూ  స్వాతంత్ర్యం రాక ముందు నుండి 4 గ్రామాల రైతులు  ఈ భూమిని నమ్ముకొని బావులు తవ్వి బోర్లు వేసి  మోటలు  కొట్టి  భూమిని అభివృద్ధి చేసి సాగుచేస్తు జీవిస్తున్నారు. 1950 సంవత్సరంలో రక్షిత కౌలుదారు చట్టం వచ్చిన తర్వాత   37ఏ సర్టిఫికెట్ ఇచ్చారు  38ఈ సర్టిఫికెట్ ఇయ్యాల్సి ఉండగా. భూస్వాములు రైతుల అమాయ కత్వాన్ని అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని  దేవుని పేరా రాయడం జరిగింది  అప్పటినుండి  రైతులను రక్షిత కౌల్దారూలుగా  నమోదు చేసి శిస్తులు వసూలు చేసి రైతులను నిలువెల్లున  ముంచినారు. ఇది రైతులకు  చెందవాల్సిన భూమి   రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం గా  రైతులకు పూర్తి హక్కులు ఉన్నది  కాబట్టి.  ప్రభుత్వాలను కదిలించే  పోరాటాలు పెద్ద ఎత్తున  చేసి  సాధించుకోవాల్సిన అవసరం వున్నది . ఎన్నోభూ పోరాటాలు చేసి లక్షలాది ఎకరాల భూములు పంచిన ఎర్ర జెండా  మీకు అండగా వుంది  మీకోసం   వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం  ఇతర ప్రజా సంఘాలు  మీకు అండగా  ఉండి మీకు భూములు వచ్చే వరకు  మీకు తోడుగా ఉంటాము  హైదరాబాద్ కేంద్రంలో  రెవెన్యూ శాఖ మంత్రి ముఖ్యమంత్రికి   లేకలు రాసి వారి దృష్టికి  తీసుకువెళ్లి  ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాం  మీరు పట్టు విడువకుండా   పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని  ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది  ఈ కార్యక్రమంలో రైతు సంఘం  జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి   వ్యవసాయ కార్మిక సంఘం  రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు  పి అంజయ్య  కెవిపిఎస్ జిల్లా నాయకులు  ఆలంపల్లి నరసింహ   రైతు సంఘం మండల అధ్యక్షులు  తావు నాయక్   భూ పోరాట సమన్వయ కమిటీ కార్యదర్శి  జోగు రాములు  నాయకులు  రాజిరెడ్డి బి కృష్ణ  జంగయ్య  అశోక్ మహేష్ కృష్ణ   చెన్నారెడ్డి ఎం రాములు పి జంగయ్య  జి యాదయ్య  చిత్తరి  గోపాల్   సత్తమ్మ పి కృష్ణయ్య  యాదయ్య   డి యాదయ్య  అంజయ్య  ముత్యాలు నారయ్య   కృష్ణయ్య   డి యాదమ్మ  చంద్రకళ   పార్వతమ్మ  సుశీల  నవీన్ కుమార్ జంగయ్య  రాములమ్మ  తదితరులు ఉన్నారు.