ఆశా కార్యకర్తలకు బియ్యం పంపిణీ

Published: Saturday July 03, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని జంగారెడ్డి పల్లి గ్రామంలో శుక్రవారం లక్ష్మీ నర్సింహ రాజు జ్ఞాపకార్థం గ్రేటర్ నల్లగొండ ఎన్నారై ఫోరం సభ్యులు సుధీర్ రాజ్ సౌజన్యంతో జిల్లా ఆర్గనైజేషన్ ఇంచార్జి బుస్స రమేష్, మండల ఇంచార్జి ఆలకుంట్ల భాస్కర్ ఆధ్వర్యంలో 10 మంది ఆశా కార్యకర్తలకు 25 కిలోల బియ్యంను వేములకొండ వైద్యాధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ జ్యోతి చేతుల మీదగా ఆశ కార్యకర్తలకు అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ అవరణలో హెల్త్ సబ్ సెంటర్ ను సర్పంచ్ శివరాత్రి ఎల్లమ్మ, ఉప సర్పంచ్ సాయిలు ప్రారంభిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి గురువారం డాక్టర్ జ్యోతి, ఏఎన్ఎమ్ శోభ చికిత్స అందిస్తారని, కరోనా కష్ట కాలంలో వారు అందించిన సేవలు అభినందనీయమని, కరోనా బాధితులకు మందులు పంపిణీ చేసి వారికి మనోధైర్యాన్ని నింపుతున్న ఆశా కార్యకర్తల సేవలను గుర్తించి ఎన్నారై ఫోరం సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని, మీరు ఇలాంటి సహాయం సహకారలు మాకు అందిస్తుంటే మేము గ్రామాలకు మరిన్ని సేవలు అందిస్తామని డాక్టర్ సుమన్ కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివరాత్రి ఎల్లమ్మ, ఉపసర్పంచ్ శివరాత్రి సాయిలు, పంచాయతీ కార్యదర్శి సుప్రియా, ఆశా కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.