ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి: సి ఐ టి య మధిర ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిల

Published: Friday February 03, 2023

2023 ఫిబ్రవరి 3 నుండి జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుత మాటూరు పేట డాక్టర్ వెంకటేష్ కు సిఐటియు ఆధ్వర్యంలో సమస్యలతోకూడినవినతిపత్రంఆశా కార్మికులు అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 26వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. గత 18 సంవత్సరాన్ననిడి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు. పారితోషికాల పనితో పాటు పారితోషికాలు లేని అనేక అదనపు పనులు ఆశాలు చేస్తున్నారు. కంటి వెలుగు, లెప్రసీ తదితర ప్రభుత్వం నిర్ణయించిన అన్ని పనులు ఆశాలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఆశాలు పని చేస్తున్నారు. పనిభారం గతంతో పోలిస్తే అనేక రెట్లు పెరిగింది. కానీ ఇన్ని పనులు చేస్తున్న ఆశాలకు నేటికీ ఫిక్సిడ్ వేతనం లేదు. పెన్షన్, ఇ.ఎస్.ఐ, ఉద్యోగ భద్రత లేదు. కనీసం ప్రసూతి సెలవులు కూడా ప్రభుత్వం నేటికీ నిర్ణయం చేయలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆశాలను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని 106 రోజులు ఆశాలు సమ్మె చేశారు. తర్వాత స్వయంగా ముఖ్యమంత్రిగారు ప్రగతి భవన్లో ఆశాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆరు వేల రూపాయలు ఫిక్సిడ్ వేతనంఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత కాలంలో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయలేదు. ఆశాలను మోసం చేస్తూ మళ్ళీ పాత పద్ధతిలోనే పారితోషికాలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశాలకు రూ.10,000/- లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నేటికి ఫిక్సిడ్ వేతనం నిర్ణయం చేయలేదు. దీనివల్ల ఆశాలు తీవ్రంగా నష్టపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలుఆకాశన్నంటుతున్నాయి. పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. కనీస వేతనం చెల్లించకపోగా కనీసం ఫిక్సిడ్ వేతనం కూడా ప్రభుత్వం నిర్ణయించక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.. కావున రాష్ట్రంలో పని చేస్తున్న ఆశాల సమస్యలు పరిశీలించాలని, ఫిక్సిడ్ వేతనం, ఇతర సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో తగిన బడ్జెట్ కేటాయించాలని మాటూరు పేట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ కు వినతి పత్రాన్ని అందించారు. వారికిి డిమాండ్స్ నెలకు.26.000/-లు ఇవ్వాలి. ఈలోపు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లు ఫిక్సిడ్ వేతనం రూ. 10,000/-లు వెంటనే నిర్ణయం చేయాలి.
 ఆశాలకు పి.ఎఫ్., ఇఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి.2022 డిసెంబర్ 6 నుండి నిర్వహించిన లెప్రసీ సర్వేకు ప్రభుత్వం అదనంగా డబ్బులు చెల్లించాలి.
2023 జనవరి 18 నుండి నిర్వహించిన కంటి వెలుగు పనికి అదనంగా డబ్బులు చెల్లించాలి. గతంలో ఆశాలు నిర్వహించిన లెప్రసీ మరియు కంటివెలుగు పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలి. టి.బి. సూటమి డబ్బాలను ఆశాలతో మోపించే పనిని రద్దు చేయాలి.ఆశాలకు పని భారం తగ్గించాలి. జాబ్ చార్టున్న విడుదల చేయాలి.2021 జులై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలి. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు వెయ్యి చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలి.
32 రకాల రిజిష్టర్స్ ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలి. ఈ లోపు ఆశాలు రిజిష్టర్స్ కోసం పెట్టిన ఖర్చులు చెల్లించాలి.
 క్వాలిటీతో కూడిన 5 పెండింగ్ యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలి..
జిల్లా ఆస్పత్రుల్లో ఆశాలకు రెస్టు రూం ఏర్పాటు చేయాలి.ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఈలోపు పని చేసిన పక్క ఆశావర్కర్లకు ఇన్ఛార్జ్ అలవెన్స్ చెల్లించాలి.
అధికారుల వేధింపులు అరికట్టాలి.ఆశాలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి. తదితర డిమాండ్లను పరిష్కారం కోసం బడ్జెట్లో కేటాయింపులు చేయాలని లేని పక్షంలో ఆశా కార్మికుల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల అధ్యక్ష కార్యదర్శులు సృజన,భారతి, లక్ష్మి ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.