కల్లూరు లో బతుకమ్మా చీరల పంపిణీ

Published: Wednesday October 06, 2021
కోరుట్ల, అక్టోబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ ఆడ బిడ్డలoదరికీ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రోజున కోరుట్ల మండలం కల్లూరు గ్రామాలోని బతుకమ్మా చీరల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వంతడుపుల అంజయ్య ప్రారంబించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ, వార్డు సభ్యులు గంగాధర్, నాగరాజు రమేష్, తిరుపతి, రాధ-మధు, శ్రీజ, బి లక్ష్మి, పంచాయితీ కార్యదర్శి పాల్గొన్నారు.