ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

Published: Monday October 10, 2022
మధిర  అక్టోబర్ 8 (ప్రజా పాలన ప్రతినిధి)
వాల్మీకి బోయ ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర పిలుపులో బాగంగా ఉమ్మడి  ఖమ్మం జిల్లా నాయకులు మురికి. వెంకన్న పర్యవేక్షణలో ఆదివారం మండలంలోని ఆత్కూర్ గ్రామంలో వాల్మీకి బోయ ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా నాయకులు మీనుగు.చైతన్య ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయవాడు వాల్మీకి రామాయణాన్ని రచించి మహాకవిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
ఈ కార్యక్రమంలో అంకె.అప్పారావు,అంకె.వెలాద్రి, అంకె వెంకటేశ్వరరావు, మీనుగు.స్వామి,అంకె. నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు.