ఇంటింటి ఆరోగ్యం జిల్లా అధికారి డాక్టర్ రాజేష్ మధిర మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ పర్యటన

Published: Saturday January 22, 2022
మధిర జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీలో ఇంటింటా ఆరోగ్యంపై జిల్లా అధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో తెలంగాణప్రభుత్వ ఆ దేశముల ప్రకారము ఈ రోజు నుంచి వైద్య ఆరోగ్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామాలలో నిర్వహిస్తున్న కొవిడ్ సర్వేను కృష్ణాపురం గ్రామంలో పరిశీలించిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాజేష్  మాట్లాడుతూ ప్రజలు భయపడవలసిన పనిలేదని, మాస్కు ధరించాలని, జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించిన వెంటనే ఆశ కార్యకర్త దగ్గర ఉన్న మెడికల్ కిట్ తీసుకొని ఇంటిదగ్గర వాడుతు ఏడు రోజులు ఇంటివద్దే ఉండాలని, రెండు డోసులు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని తెలియ పరచినారు.. వీరితో మాటూరు పేట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, మండల స్పెషల్ అధికారి శ్రీనివాస్, మండల డెవలప్మెంట్ అధికారి విజయభాస్కర్ రెడ్డి, MPO శాస్త్రి, ఆరోగ్య పర్యవేక్షణ అధికారి భాస్కరరావు పాల్గొన్నారు...