హోప్ హెల్పింగ్ హాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం

Published: Friday April 23, 2021
​గొల్లపల్లి, ఏప్రిల్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : ​జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద  కుటుంబానికి చెందిన శ్రీరాముల మహేష్- అశ్విత దంపతుల కుమారుడు నాలుగు నెలల బాబుకి గుండెకు ఆపరేషన్ నిమిత్తం ఆర్ధిక సహాయం అవసరమైన విషయాన్ని సామాజిక సేవకులు చౌటపెల్లి తిరుపతి ద్వారా విషయాన్ని  తెలుసుకున్న హొప్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంద సంస్థ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫ్రెండ్స్ హోప్ హెల్పింగ్ హాండ్స్ జగిత్యాల శాఖకు చెందిన సభ్యులు పాల్తేపు భూమేశ్వర్ పవన్ హరికృష్ణ ద్వారా రూ.20500 రూపాయలు, మరియు గొల్లపెల్లి గ్రామానికి చెందిన నల్ల తిరుపతి రెడ్డి రూ. 2000 చిన్నబాబు  గుండె అపరేషన్ నిమిత్తం ఆర్థిక సహాయం కుటుంబానికి అందజేయడం జరిగింది. పలువురు ప్రముఖులు వీరి సేవ ధాతృత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హోప్  సంస్థ సభ్యులతో పాటు సామాజిక సేవకుడు చౌటపెల్లి తిరుపతి మరియు ఎల్లంకి వేణుగోపాల్ చౌటపెల్లి రఘు అంకం భూమయ్య, ఎనగందుల సాయి తదితరులు. పాల్గొన్నారు.