ఏసీపీ నరేష్ రెడ్డి ఉప్పల్ సీఐ గోవింద్ రెడ్డిలను సత్కరించిన జర్నలిస్టులు

Published: Saturday December 31, 2022
మేడిపల్లి, డిసెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి)

ఉప్పల్ పోలీస్ స్టేషన్ శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉత్తమ పోలీస్ స్టేషన్గా అవార్డు అందుకున్న సందర్భంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఏసీపీ నరేష్ రెడ్డిని, ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డిని మరియు  ఇతర సబ్ ఇన్స్పెక్టర్లను పోలీస్ సిబ్బందిని శాలవాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నరోత్తం రెడ్డి,  ఈసి మెంబర్ ఏవి శ్రీధర్ రావు,  మరియు ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యులు మాదిరాజు సురేష్, పి సాగర్, వడ్డేపల్లి కిషోర్, శివాజీ, దాస రాజు తదితరులు పాల్గొన్నారు.