మున్సిపాలిటీలోఆర్పీలకు హైజీన్ కిట్ లు పంపిణీ

Published: Tuesday January 25, 2022
మధిర జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ ఆధ్వర్యంలోఫీవర్ సర్వే లో భాగంగా మధిర మున్సిపల్ మెప్మా సిబ్బంది ఆర్పీలకు యూనిసెఫ్ సంస్థ వారు అందించిన శానిటైజేషన్ కిట్లను (హైజీన్ కిట్) అందజేసిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ఫీవర్ సర్వే ద్వారా ప్రతి ఒక్కరూ పూర్తి సమాచారం అందిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోగలరని, కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ హెల్త్ సిబ్బందికి ఫీవర్ సర్వే లో మెప్మా ఆర్పీలు సహకరించగలరని, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకోని మెడికల్ కిట్లు అందచేయాలని ఆర్పీలకు తెలియజేశారుఅదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు డోస్ ల టీకను, సమయ నియమ నిబంధనలు పాటిస్తూ వ్యాక్షీనేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమీషనర్  మరియు మెప్మా ఆర్పీ లు పాల్గొన్నారు.