హబ్సిగూడలో ఐబాకో చాక్లెట్ కేక్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Monday January 31, 2022
మేడిపల్లి, జనవరి 30 (ప్రజాపాలన ప్రతినిధి) : హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 ప్రధాన రహదారిలో ఐబాకో చాక్లెట్ కేక్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన కేక్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ లను అందించాలని ఐబాకో యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గాయం శ్రీధర్ రెడ్డి, గరిక సుధాకర్, రవీందర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి  లక్ష్మీనారాయణ, మనోహర్, జెసిబి రాజు, నంది కంటి శివ, పూర్ణచందర్రావు, ఐబాకో యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.