విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ విద్యను మూలన పడేసిం

Published: Saturday June 18, 2022
కరీంనగర్ జూన్ 17 ప్రజాతంత్ర ప్రతినిధి
 
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు విద్యావ్యవస్థపై పూర్తిగా చిత్తశుద్ది లేదని స్పష్టమయ్యిందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి విమర్శించారు. బాసర రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిపుల్‌ ఐటీ) విద్యార్థులు గత నాలుగు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. 8 వేల మంది విధ్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎండనక.. వానను లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నా సీఎం మెట్టు దిగి రావడం లేదన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులవి సిల్లీ డిమాండ్‌లు అంటూ సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్య చూస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యావ్యవస్థ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్‌ భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీ  విద్యార్థుల సమస్యలను సిల్లీ అని తీసేసిన సిల్లి సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క ట్రిపుల్ ఐటీని మెయింటెన్ చేయని సీఎం మిగతా విద్యాసంస్థలను ఏం మెయింటెన్ చేస్తారని ఆయన నిలదీశారు. కేజీ టు పీజీ అని హామీ  ఇచ్చిన కేసీఆర్ దాన్ని మూలన పడేశారని, విద్యాహక్కు చట్టాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ అనర్హుడని తెలిపారు.  కనీస నైతిక విలువలు, బాధ్యతలను విస్మరిస్తూ సొంత లాభం కోసం చూసే వ్యక్తి అసలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? అని అన్నారు.  కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలను ఉన్నత చదువులు చదువుకోనీయడకుండా, ఉద్యోగాలు రానీయకుండా సీఎం వ్యవహరిస్తున్నారు.  రాష్ట్రంలో 4 వేల ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసి కార్పోరేట్ వ్యవస్థను కాపాడుకుని దోచుకున్నారన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో విధ్యార్థులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. డిగ్రీ , ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో చదువు పూర్తి చేసుకున్న విధ్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వాపోయారు. ఫలితంగా విధ్యార్థులు ఉద్యోగాలు చేసుకోవడానికి , పై చదువులు చదువుకోవడానికి దూరమవుతున్నారని వాపోయారు.  బాసరలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన విద్యాశాఖ మంత్రి ఆ సమస్యలను తక్కువ చేసి మాట్లాడడం సమంజసం కాదన్నారు. వర్సిటీలో రెండేళ్లుగా వీసీ నియామకం లేదని, బోధనకు సరిపడా అధ్యాపకులు లేరన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేయాలని చూడడం దారుణమన్నారు. ప్రతిపక్షాలు చేపట్టే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను పోలీసుల అండదండలతో అణచివేస్తున్న ప్రభుత్వం ట్రిపుట్‌ విద్యా ర్థులపై అదే రీతిలో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నిర్లక్ష్యపూరిత వైఖరి విధా నాలతో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం భావ్యం కాదన్నా రు. విద్యార్థుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించడంలో విఫ లమైన కేసీఆర్‌ సర్కార్‌ ఘటనను పక్కదారిపట్టించే రీతిలో  చేస్తున్నారన్నారు.   న్యాయమైన సమస్యలను పరిష్కరించమని కోరి ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీ సులను ప్రయోగించి అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. క్యాం పస్‌  చుట్టూ పోలీసులను పెట్టి విద్యాసంస్థను డిటెంషన్‌ సెంటర్‌గా మార్చి వేశారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అహంకారంతో సీఎం కేసీఆర్ విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారన్నారు. విద్యార్థులు 12 రకాల డిమాండ్లలో  రెగ్యులర్‌ వీసీని నియ మించాలని, క్యాంపస్‌లోనే ఉండాలని, అధ్యాపకుల సం ఖ్యను పెంచాలని, ఇన్ఫర్మెషన్‌ టెక్నా లజీ ఆధారిత విద్యను అందించాలని, హాస్టల్‌ తరగతి గదులకు మరమ్మతులు చే యాలని, ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్‌లు, మం చాలు, బెడ్‌లు అందించాలని, నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, పీటీలను నియమించాలని వి ద్యా ర్థులు డిమాండ్‌ చేస్తున్నారన్నారు.  మూడేళ్ల నుంచి నాలుగున్నర వేల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్స్‌, ఇతర వస్తు సామగ్రి అందడం లేదని ,  నెల రోజుల్లో మరో 1500 మంది విద్యార్థులు కొత్తగా చేరనున్నారని తెలిపారు.    ఈ లెక్కన సమస్యలు పరిష్కారం కావాలంటే రూ.20 కోట్ల వ్యయం అవుతుందని యూనివ ర్సిటీ అధికారులు పేర్కొంటుండగా అది ప్రభుత్వానికి సమస్య అవుతుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ విదేశాల ఖర్చే 11 కోట్లు పెట్టుకుంటే విధ్యార్థుల న్యాయమైన సమస్య ఒక లెక్కా అని ప్రశ్నించారు.  ఇప్పటికైనా విధ్యార్థులను  శాంతింపజేసి సమస్యలను పరిష్కరించాలని, విద్యాసంస్థల చుట్టూ మోహరించిన పోలీసు క్యాంపు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.