పాత్రికేయుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే ధ్యేయం.

Published: Wednesday February 01, 2023

జన్నారం, జనవరి 31, ప్రజాపాలన: పాత్రికేయల  సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే ఐజేయూ అహర్నిశలు పని చేస్తుందని యూనియన్ సభ్యత్వ బాధ్యులు రూపి రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కాచం సతీష్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట్ మండల కేంద్రాల్లో యూనియన్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయులు ఎదుర్కొంటున్న  సమస్యలపై రాజీలేని పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.    టీయూడబ్ల్యూజే, ఐజేయూ, పోరాటాల వల్లనే పాత్రికేయులకు అనేక సహాయ సహకారాలు లభించాయన్నారు. అనేక మంది జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, ఆపద కాలంలో ఆర్థిక సహకారాలు కూడా అందించిన ఘనత మన యూనియన్ కే దక్కిందన్నారు.   జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు, ఇళ్ల్లు ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సభ్యత్వ నమోదును ముమ్మరంగా చేపట్టి యూనియన్ బలోపేతం కోసం అందరూ సహకరించాలని కోరారు. ఈ  కార్యక్రమం లో జిల్లా అక్రిడిటేషన్ కమిటి సభ్యుడు  మానిశెట్టి మాంతయ్య, సీనియర్ జర్నలిస్టులు ఆకుల రాజు, సురేష్ చౌదరి, బిజ్జురి శ్రీనివాస్,  సి యు డబ్ల్యూ జే, ఐజేయు సంఘం  జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల సత్యం, సభ్యులు సి హెచ్ నర్సయ్య, ఎంబడి మల్లేశం,గాజుల లింగన్న, అమరగొండ సతీష్, గుండ పవన్, గోనె సత్యం, శీల శేఖర్, ఐలవెని నర్సయ్య, కనికరం కిరణ్, పోతు శంకర్, నగూరి అరున్ కుమార్, గోలి వెంకటపనిరాజు, తోకల విశ్వేష్, దండేపల్లి, లక్షెట్టిపేట్ మండలల పాత్రికేయులు పాల్గొన్నారు.