కరెంటు కోతలతో అన్నదాతలు అవస్థలు

Published: Tuesday February 07, 2023

 విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా,   ఏఈకి వినతి పత్రం మధిర ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో ఎర్రుపాలెం మండల,ఎర్రుపాలెం, కరెంటు కోతలతో అన్నదాత లు పడరాని అవస్థలు పడుతున్నారని వ్యవసాయ మోటార్లకు త్రీఫేస్ కరెంటు కోసం రాత్రి వేళలో విద్యుత్ మోటార్ల దగ్గర పడి కాపులు కాయాల్సివస్తుందని పగటి వేళలోనే త్రీఫేస్ కరెంటును సరఫరా చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం మండల పరిధి లోని మామునూరు విద్యుత్ సబ్ స్టేషన్ ముందు రైతులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం మండల విద్యుత్ అధికారి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ ప్రాణం పోకడ కరెంటు రాకడ అన్నచందంగా విద్యుత్ సరఫరా జరుగుతుందని, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సరఫరా లో ఉన్న లోపాలను సవరించి 24 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా లోపాల వలన పడరాని పాట్లు పడుతున్నామని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తపరిచారు. ఈ కార్య క్రమం లో రైతులు గొల్లపూడి కోటేశ్వరరావు, ఎస్.కె బాజీ, వీరాంజనేయులు, నారాయణరావు, హనుమంతరావు, తదితర రైతులు పాల్గొన్నారు.