ట్రస్మ నాయకుల పై విద్యార్థి సంఘాల నిరసన

Published: Tuesday October 25, 2022
- విద్యార్థి సంఘాల పై చేసిన అసత్య ఆరోపణలను ఖండించిన ఐక్య విద్యార్థి సంఘాలు    
 
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 23, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా ట్రస్మ నాయకులు జిల్లాలోని విద్యార్థి సంఘాల నాయకుల పై చేసిన అసత్య ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ చౌరాస్తా లో ఆదివారం నిరసన  తెలియజేశారు. అనంతరం  ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న తీరును ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయాన్ని జీర్ణించుకోలేకనే విద్యార్థి సంఘాలపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ పోలీస్ కమిషనర్ ను కలవడం పై నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఎన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేస్తున్నాయో ? ఎన్ని యాజమాన్యాలు జీవో ఎంఎస్ నెంబర్ వన్ ప్రకారంగా పనిచేస్తున్నాయా ? ఎన్ని పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్స్ ఉన్నాయో ? తెలియాజేయాలి,  కనీస వేతనాలు కూడా ఉపాధ్యాయులకు చెల్లించని ఈ యజమాన్యాలు విద్యార్థి సంఘాలపై అసత్య ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేశారు, కొన్ని పాఠశాలలకు ఒక బిల్డింగ్ లో అనుమతి ఉంటే రెండు బిల్డింగుల్లో తరగతులు నిర్వహిస్తున్నాయని ఇది ఎలా న్యాయమని ఐక్య విద్యార్థి సంఘాలుగా ట్రస్మ వారిని వివరణ కోరుతున్నామని అన్నారు. శనివారం  ట్రస్మా వాళ్ళు కొన్ని కుల సంఘాలు వాటి అనుబంధ విద్యార్థి సంఘాలు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను వేధిస్తున్నాయని అనడం సిగ్గుచేటని ఏ ఒక్క విద్యార్థి సంఘం కూడా ఏ యాజమాన్యాన్ని వేధించింది లేదని, వేధించినట్లు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని తెలియజేస్తున్నాం అని అన్నారు.ట్రస్మ నాయకులు చేస్తున్న అసాంఘిక అక్రమ కార్యకలాపాలకు విద్యార్థి సంఘాలుగా  అడ్డుగా ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే విద్యార్థి సంఘాల నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేశారని, ప్రైవేట్ యాజమాన్యాల లాగా విద్యార్థి నాయకులు ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు చేయడం లేదని విమర్శించారు. కనీసం కరోనా ఆపత్కాల సమయంలో జిల్లా ట్రస్మా క్రింది స్థాయి ఉద్యోగులను ఆదుకోలేకపోయిందని అలాంటి మీరు విద్యార్థి సంఘాలను ఎలా విమర్శిస్తారు అని అన్నారు. విద్యార్థి సంఘాల పై చేసిన ఆరోపణలను విరమించుకొని బేషరతుగా క్షేమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల అక్రమాల పై త్వరలో పోలీస్ కమిషనర్ తో పాటు జిల్లా విద్యా శాఖ అధికారి, ఫైర్ సేఫ్టీ అధికారి, జిల్లా రవాణా శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిచారు.
ఈ కార్యక్రమంలో తోట రాజేష్ పి డి ఎస్ యు, చిప్పకుర్తి శ్రీనివాస్ టి వి యు వి,జమ్మిడి గోపాల్ ఏన్ ఎస్ ఎఫ్,
బచ్చలి ప్రవీణ్ కుమార్ వి జే ఎస్,చేరలా వంశీ టి పి వి ఎస్,వడ్ల కొండ సంజయ్ ఎం ఎస్ ఎఫ్,
జాగిరి నరేందర్ ఎన్ ఎస్ ఎఫ్,పైతర్ సాగర్ జె ఎ సి నాయకులు, జీలకర శంకర్  ఏం ఆర్ పి ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.