పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయుటకు చర్యలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

Published: Saturday April 01, 2023
మంచిర్యాల బ్యూరో, మార్చి 31, ప్రజాపాలన:
 
 
మార్చి 16 నుండి 21వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాల తో జిల్లాలో పంట నష్టపోయి రైతులకు పరిహారం అందించడానికి అదికాౠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బృందావన్ సంతోష్ ఆదేశించారు.
 శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, జిల్లా ఉద్యానవన అధికారి వి. ఉదయ్కుమార్ తో కలిసి వ్యవసాయ, విస్తరణాధికారులతో ప్రకృతి వైపరీత్యం, పంట నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16 నుండి 21వ తేదీ వరకు జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టానికి గురైందని, ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి వ్యవసాయ, విస్తరణాధికారులు, ఉద్యానవన శాఖ అధికారుల సమన్వయంతో నిస్పక్షపాతంగా విచారణ జరిపి 33 శాతం పంట దెబ్బతిందని నిర్ణీత ప్రొఫార్మాలో అందించిన నివేదిక ఆధారంగా అర్హులైన వ్యవసాయదారుల జాబితా రూపొందించి ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం లోగా అందించాలని అధికారులను ఆదేశించారు. 
జాబితా రూపొందించడంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలోనే దెబ్బతిన్న పంటకు పరిహారంగా ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో దెబ్బతిన్న పంట పరిశీలన కోసం 5 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించ డంతో పాటు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.