నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ల పై చర్యలు తీసుకోవాలి. మంచిర్యాల బ్యూరో, ఎప

Published: Monday April 03, 2023
నిబంధనలు పాటించని కార్పొరేట్ ఆసుపత్రుల పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరిగెల మహేష్
డిసెంబర్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజలను అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ఎలాంటి అర్హత లేని వాళ్ళని హాస్పటల్ లో నర్సు లుగా తీసుకొంటున్నారని,. మెడికల్  షాప్ హాస్పటల్ లో నిర్వహించ రాదనే నిబంధనలు విస్మరించి దోపిడీ చేస్తున్న రాని అన్నాడు. మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ లో 24/7 డాక్టర్స్ ఉండాలి,  వ్యాధులకి సంబందించిన వైద్యులు ఉండాలి కాని ఇవేమీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలు పాటించని  హాస్పటల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు, రాజ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.