గోవిందాపురం(ఏ) గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

Published: Saturday November 05, 2022
బోనకల్, నవంబర్ ఐదు ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం ఏ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పిల్లలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ కమిటీ యందు కూలంకషంగా చర్చించి వారి యొక్క సమస్యలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
 జిల్లా బాలల రక్షణ విభాగం నుండి స్రవంతి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయటం వలన పిల్లల యొక్క హక్కులకు భంగం వాటిల్లకుండా పిల్లలు స్వతంత్రంగా జీవిస్తూ వారి హక్కులను అనుభవిస్తూ బాల్యాన్ని కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కమిటీలు ప్రతినెల మీటింగ్ పెట్టుకుని గత నెలలో బాలలకు గురించి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని పరిష్కరించే విధంగా ప్రతినెల జరుపుకోవాలని తెలియజేశారు.అంగన్వాడి సూపర్వైజర్ శ్రీమతి రమా దేవి మాట్లాడుతూ తమ మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎఫర్ట్ సంస్థ వారిని కలిసి అన్ని గ్రామాలలో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, కమిటీలు లకు గ్రామ సర్పంచ్ అధ్యక్షులుగా ఉంటూ ఆ గ్రామ అంగన్వాడి టీచర్ కన్వీనర్ గా ఉంటారని, మీటింగ్ లో చర్చించిన అంశాల ద్వారా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా చూస్తామని తెలియజేశారు. ఎఫర్ట్ సంస్థ నుండి వచ్చిన బుజ్జి మాట్లాడుతూ తమ సంస్థ క్రై అనే సంస్థ సహకారంతో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన్ని బాలల స్నేహపూర్వక గ్రామంగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, పంచాయితీ సెక్రటరీ హిమబిందు , అంగన్వాడి సూపర్వైజర్ రామా దేవి, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం స్రవంతి, ఎఫర్ట్ సంస్థ సభ్యులు బుజ్జి , అంగన్వాడి టీచర్లు లక్ష్మి, నాగేంద్రమ్మ , ఆశా వర్కర్ దేవమని, స్కూల్ టీచర్ లు శ్రీను , పంచాయితీ సిబ్బంది, ఐకెపి సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.