ఘనంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Friday December 30, 2022
మంచిర్యాల టౌన్ , డిసెంబర్ 29, ప్రజాపాలన: విజయవంతమైన ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నస్పూర్ మండల కేంద్రంలోని సిసి నస్పూర్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా జాతీయ రహదారి నుండి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీగా నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  మండల విద్యాశాఖ అధికారి పోశయ్య హాజరై మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను పలు ప్రదర్శనల ద్వారా కండ్లకు అద్దినట్టుగా చూపెట్టడం జరిగిందని, విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు మరింత ఉదృతం చేయాలని సూచించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధాగం శ్రీకాంత్ మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 53 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో అనేక అలుపెరుగని పోరాటాలు నిర్వహించామని, ఎందరో అమరుల ఉద్యమ అమరవీరుల త్యాగాలతో ఎస్ఎఫ్ఐ తన ప్రయాణం కొనసాగిస్తుందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం పేరుతో విద్యాసంస్థల్లో మతోన్మాదాన్ని చొప్పించే విధంగా కుట్రలు చేస్తుందని, వాటికి ఎస్ఎఫ్ఐ దీటుగా సమాధానం చెప్తుందని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో సింగరేణి హై స్కూల్, బ్లూ బర్డ్ హై స్కూల్, రేడియం హై స్కూల్, కృష్ణవేణి హై స్కూల్, ఆక్స్ఫర్డ్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొని పలు సాంస్కృతిక అంశాలపై చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. అనంతరం గెలుపొందిన వివిధ పాఠశాల విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు బండి సత్య నారాయణ ఈదునూరి అభినవ్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ రాచర్ల శారద, జిల్లా కమిటీ సభ్యులు రజిత, రామాంజలి, మల్లేష్, అనిల్, సాయికృష్ణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.