పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి:సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Monday January 23, 2023

 

 బోనకల్, జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని అళ్లపాడు గ్రామంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పిల్లలకు ప్రతినెల ఇచ్చేటువంటి వ్యాక్షణను శనివారం ఆళ్ళ పాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ పిల్లల పట్ల ఆరోగ్యం విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు సలహాలు తెలియజేశారు. క్రమo తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని తల్లులకు తెలియజేశారు. అలాగే ఆళ్లపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలోకంటి వెలుగు కార్యక్రమం మార్చి 2వ తారీకు నుండి 14 వ తారీకు వరకు ఆళ్లపాడు గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కంటి సమస్యలు ఉన్న అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, హెచ్ వి రాజ్యలక్ష్మి, ఏఎన్ఎం తిరుపతమ్మ, ఆశ కార్యకర్తలు కళావతి, రత్నకుమారి, అంగన్వాడీ టీచర్ పద్మ, హుస్సేన్ బి గౌరమ్మ, పంచాయతీ కార్యదర్శి పరశురాం పాల్గొన్నారు. బోనకల్, జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని అళ్లపాడు గ్రామంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పిల్లలకు ప్రతినెల ఇచ్చేటువంటి వ్యాక్షణను శనివారం ఆళ్ళ పాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ పిల్లల పట్ల ఆరోగ్యం విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు సలహాలు తెలియజేశారు. క్రమo తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని తల్లులకు తెలియజేశారు. అలాగే ఆళ్లపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలోకంటి వెలుగు కార్యక్రమం మార్చి 2వ తారీకు నుండి 14 వ తారీకు వరకు ఆళ్లపాడు గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కంటి సమస్యలు ఉన్న అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, హెచ్ వి రాజ్యలక్ష్మి, ఏఎన్ఎం తిరుపతమ్మ, ఆశ కార్యకర్తలు కళావతి, రత్నకుమారి, అంగన్వాడీ టీచర్ పద్మ, హుస్సేన్ బి గౌరమ్మ, పంచాయతీ కార్యదర్శి పరశురాం పాల్గొన్నారు.